English | Telugu
ఇళయరాజా, మోహన్ బాబుల శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయం
Updated : May 10, 2011
ఇళయరాజా, మోహన్ బాబుల శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యాదాత అయిన కలెక్షన్ కింగ్, పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబు త్వరలో ఒక శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయాన్ని స్థాపించబోతున్నారు. ఆ విశ్వవిద్యాలయానికి అధిపతిగా ప్రముఖ సినీసంగీత దర్శకులు, ఇసైరాజాగా పేరుపడ్డ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వ్యవహరిస్తారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణానికి సమీపంలో శ్రీ విద్యానికేతన్ అనే అన్ని ఆధునిక వసతులతో కూడిన చక్కని విద్యాలయాన్ని స్థాపించిన మోహన్ బాబు ఈ శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయాన్ని కూడా అక్కడే స్థాపించాలని అనుకుంటున్నారు. ఈ శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయానికి అధిపతిగా వ్యవహరించటానికి ఇళయరాజా కూడా అంగీకరించారనీ, ఇక ఆ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం తీసుకుని శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయం పనులు త్వరలో ప్రారంభించనున్నారని తెలిసింది. మోహన్ బాబుకి సంగీతం అంటే చాలా ఇష్టం అన్న సంగతి ఆయన సినిమాల్లోని పాటలే మనకు చెపుతాయి.