English | Telugu
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి శేఖర్ కమ్ముల సినిమాలు
Updated : May 10, 2011
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి శేఖర్ కమ్ముల సినిమాలు ఎన్నికయ్యాయి. వివరాల్లోకి వెళితే తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎమిగోస్ అనే సొంత బ్యానర్ పైన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి సినిమాలను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రముఖ యువ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలు కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి ఎన్నికయ్యాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా, రాజా, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన తొలి కమర్షియల్ చిత్రం "ఆనంద్" తో పాటు యువతను విపరీతంగా ఆకర్షించిన సూపర్ హిట్ కమర్షియల్ మూవీ "హ్యాపీడేస్" కూడా కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి ఎన్నికయ్యింది.
గతంలో ఇలా అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సినిమాలు కేవలం ఆర్ట్ ఫిలింస్ మాత్రమే కావటం, అవి కమర్షియల్ గా హిట్టవ్వకపోతూండటం జరిగేది. కానీ కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి కమర్షియల్ గా మంచి హిట్టయిన సినిమాలు "ఆనంద్, హ్యాపీడేస్" చిత్రాలు ఎన్నిక కావటం ముదావహం. శేఖర్ కమ్ముల చిత్రాలు కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కి ఎన్నికైన సందర్భంగా ఆయనకి తెలుగువన్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.