English | Telugu
ఆ హీరోయిన్ కూతురు పెళ్లికి చిరంజీవి ఎన్టీఆర్ లకి ఉన్న సంబంధం ఏంటి
Updated : Nov 20, 2023
ఆ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో సినిమాల్లో నటించి మెగా స్టార్ వేసే స్టెప్ లకి ధీటుగా స్టెప్ లు వేసి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. అలాగే ఆ హీరోయిన్ కూతురు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడంతో పాటు ఆడిపాడింది. చిరుతో ఆడిపాడిన హీరోయిన్ ఎవరో కాదు రాధ. ఎన్టీఆర్ తో ఆడిపాడింది ఎవరో కాదు రాధ కూతురు కార్తీక. ఇప్పుడు ఈ ఇద్దరు నెట్టింట హల్చల్ చేస్తున్నారు.
తాజాగా రాధ కూతురు కార్తీక వివాహం కేరళలోని త్రివేండ్రం లో చాలా ఘనంగా జరిగింది. రోహిత్ మీనన్ అనే అతన్ని కార్తీక ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యి నూతన వధూవరులిద్దరని ఆశీర్వదించాడు. అలాగే 80 వ దశకంలో మెగాస్టార్ తో ఆడిపాడిన రాధిక, సుహాసిని లు కూడా ఈ వివాహానికి హాజరయ్యి చిరు తో కలిసి కలిసి సందడి చేసారు.ఫంక్షన్ మొత్తానికి చిరంజీవి సెంటర్ ఆఫ్ అట్రాక్క్షన్ గా నిలిచాడు. కార్తీక పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
నాగ చైతన్య హీరోగా పరిచయమైన జోష్ చిత్రం ద్వారానే కార్తీక కూడా తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలతో పాటు ద్విభాషా చిత్రమైన రంగం మూవీలో కూడా కార్తీ క నటించింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా ఆమెకి అంతగా గుర్తింపు రాలేదు. మలయాళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించిన కార్తీక ఆ తర్వాత సినిమాలకి పూర్తిగా స్వస్తి చెప్పి దుబాయ్ లో ఉన్న తమ హోటల్ బిసినెస్ ని చూసుకుంటూ ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది.