English | Telugu

Chiranjeevi: మెగాస్టార్ ట్రిపుల్ ట్రీట్.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!

2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. అదే ఏడాది ఆగస్టులో వచ్చిన 'భోళా శంకర్'తో పరాజయాన్ని చూశారు. చిరంజీవి నుంచి కొత్త సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీంతో అభిమానులు మెగాస్టార్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ గ్యాప్ ని భర్తీ చేసేలా ఇప్పుడు ఒకే ఏడాది మూడు సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు చిరు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేస్తున్నారు చిరంజీవి. 2026 సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ ఏడాది విడుదల కావాల్సిన 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా 2026 వేసవిలో థియేటర్లలో అడుగుపెట్టనుంది. వీటితో పాటు మరో సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది.

'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ మరోసారి చేతులు కలిపారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులో అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ లో షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని 2026 చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అంటే ఒకే ఏడాది మూడు సినిమాలతో సందడి చేయబోతున్నారు చిరంజీవి. మరి ఈ సినిమాలతో ఆయన బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం