English | Telugu

'మెగా 157' టైటిల్ ఇదే.. షాక్ లో మెగా ఫ్యాన్స్..!

కొన్ని కాంబినేషన్స్ కేవలం ప్రకటనతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ మధ్య కాలంలో అలా అందరి దృష్టిని ఆకర్షించిన కాంబినేషన్స్ లో ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోను చెప్పుకోవచ్చు. వీరి కలయికలో మొదటి సినిమా రూపొందుతోంది. మెగాస్టార్ కెరీర్ లో 157 గా సినిమాగా రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

'మెగా 157' మూవీ 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు తగ్గట్టే ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. అదేంటంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. అదే పేరుని ఈ సినిమాలో చిరు పాత్రకు పెట్టారు. టైటిల్ కూడా అదే పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో.. 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ను లాక్ చేసినట్లు వినికిడి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది.

అయితే శంకర్ అనే పేరు మెగా ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే చిరంజీవి గత చిత్రం 'భోళా శంకర్' పరాజయం పాలైంది. దాంతో కొందరు ఫ్యాన్స్ దానిని నెగటివ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అయితే ఎటువంటి ఆందోళన అక్కర్లేదని చెబుతూ.. గతంలో చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీఎస్'తో బ్లాక్ బస్టర్ కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అనిల్ రావిపూడికి అపజయమెరుగని దర్శకుడిగా పేరుంది. వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. అలాంటి రావిపూడి మొదటిసారి మెగాస్టార్ తో చేతులు కలిపాడు. అనిల్ రావిపూడికి కామెడీ డైరెక్టర్ గా అదిరిపోయే క్రేజ్ ఉంది. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు కలిసి వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే అవకాశముంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం