English | Telugu

మయూరి ట్రైలర్..న‌య‌న‌తార చెమటలు పట్టిస్తోంది!!

న‌య‌న‌తార తొలిసారి హార‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. అశ్విన్ శ‌ర‌వ‌న‌న్ ద‌ర్శకుడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కిన చిత్రం 'మయూరి'. త‌మిళంలో మాయ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న వినాయక చవితి సంధర్భంగా తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. భారీ హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార ఓ తల్లి పాత్రలో నటించింది. విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రతి క్షణం భయపెడుతూ, థ్రిల్ కు గురిచేసే విధంగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భారీగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.