English | Telugu

కరెంటు తీగ ఫస్ట్‌లుక్ రిలీజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కరెంట్ తీగ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మే 20 న మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ని విడుదల చేశారు. ఆగస్టులో విడుదలకు సిద్ధం చేస్తున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
తాను ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లోకి బెస్ట్ చిత్రం కరెంట్ తీగ అని, ఈ టీమ్ ది బెస్ట్‌ టీం అని చెబుతున్నమనోజ్ కరెంట్ తీగలో తన క్యారెక్టర్ పట్ల కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
సో, ప్యాషన్ ఉన్న టీంతో పనిచేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయనే నమ్మకంతో సాగుతున్న ఈ యూనిట్ కి ఆల్ ద బెస్ట్. అలాగే బర్త్ డే స్టార్ మంచు మనోజ్ కి పుట్టిన రోజు విషెస్ అందిస్తోంది తెలుగువన్.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.