English | Telugu
మాస్ స్టెప్పులతో.. మంచు లక్ష్మి
Updated : Apr 6, 2015
మంచు లక్ష్మీ ప్రసన్న మాస్ స్టెప్పులతో అలరించబోతోందా?? ఫ్యాంటూ షర్టూ వేసి మగరాయుడులా దుమ్ము దులపబోతోందా?? దొంగాట లోని యాందిరో.. పాట వింటే ఆ విజువల్స్ చూస్తే అలానే అనిపిస్తోంది. మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తూ, నటించిన చిత్రం దొంగాట. ఈ సినిమాలో మంచు లక్ష్మి యాందిరో అన్న పాట పాడింది. రఘు కుంచె స్వర పరిచిన ఈ పాట.. మాస్ బీట్‌లో సాగిపోయింది. లక్ష్మి కూడా హుషారుగా పాడేసింది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్న రెచ్చిపోయి డాన్సులు చేసేసిందని టాక్. నటిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకొంది ఈ మంచు వారి అమ్మాయి. కానీ కమర్షియల్ సినిమాలు మాత్రం ఆమె నుంచి రాలేదు. ఆలోటు ఈ దొంగాట తీర్చబోతోందని తెలుస్తోంది. మరి లక్ష్మీ ప్రసన్న డాన్సింగ్ టాలెంట్ ఏమిటో తెలుసు కోవాలంటే... ఈ సినిమా వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.