English | Telugu

మమిత భైజు దెబ్బకి పూజాహెగ్డే విలవిల  

- కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
- పూజాహెగ్డే కి షాక్
- ధనుష్ మూవీలో మమిత భైజు
- డ్యూడ్ తో మరోసారి ఆకట్టుకున్న మమిత భైజు


కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ అని లెజండ్రీ లిరిక్ రైటర్ 'సముద్రాల సీనియర్' ఏ ముహూర్తాన చెప్పారో కానీ, ప్రతి రంగంలోను ఈ సాంగ్ ని తలుచుకొని వారంటు ఉండరు. సినిమా రంగంలో అయితే కొంచం ఎక్కువగానే తలచుకుంటు ఉంటారు. ఎందుకంటే సినీ రంగంలో ఎవరి అవకాశాలని ఎప్పుడు ఎగరేసుకుపోతారో తెలియదు. అందుకే నటీనటులతో పాటు 24 క్రాఫ్ట్స్ కి చెందిన వాళ్ళందరి నోళ్ళల్లో సదరు సాంగ్ రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సాంగ్ ప్రముఖ హీరోయిన్ 'పూజాహెగ్డే' పాడుకోవాల్సిన పరిస్థితి.

స్టార్ హీరో ధనుష్ 'పోర్ తోజిల్' ఫేమ్ 'విగ్నేష్ రాజా' దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ధనుష్ నుంచి వస్తున్న 54వ మూవీ. ఇందులో తొలుత పూజాహెగ్డే ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మమిత భైజు చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుందని కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూజాకి చాలా కాలం నుంచి సినిమాలు లేవు. ఈ ఏడాది మే లో సూర్య తో కలిసి చేసిన 'రెట్రో' పరాజయం చెందింది. దీంతో ధనుష్ మూవీ తన కెరీర్ కి మంచి బూస్టప్ ని ఇస్తుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అలాంటిది ఈ మూవీ నుంచి తప్పించడం పూజా కి ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పూజా లిస్ట్ లో ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగాన్ ఉంది. ఈ చిత్రంలో మమిత బైజు కూడా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.

Aslo read: చిరంజీవి మూవీలో కార్తీ! ప్లాన్ అదిరింది బాసు!
ఇక మమిత భైజు 'ప్రేమలు' తో పాన్ ఇండియా ప్రేక్షకులని తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది. రీసెంట్ గా డ్యూడ్ విజయంలో భాగస్వామ్యమవ్వడమే కాకుండా, తాను ఎంత వాల్యుబుల్ నటినో మరోసారి చెప్పినట్టయింది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కనుండగా మమిత బైజు ట్రెడిషినల్ విలేజ్ గర్ల్ క్యారక్టర్ లో కనిపించనున్నట్టు సమాచారం.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.