English | Telugu

శ్రీలీలను ప్రేమలోకి దింపుతున్నారు.. ఎవరు చేస్తున్నారా పని?

- అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను
- లవ్‌లో ఉందేమో.. అందుకే అలాంటి కామెంట్స్‌ చేస్తోంది
- ఇది మొదటి స్టెప్‌ అనుకుంటే..

హీరో అయినా, హీరోయిన్‌ అయినా ఎంతో కష్టపడి ఒక స్థాయికి చేరుకుంటారు. తద్వారా వారికి అభిమానులు కూడా ఏర్పడతారు. తమ అభిమాన నటీనటులకు సంంబంధించిన అన్ని విషయాల గురించి స్పందిస్తుంటారు.

ముఖ్యంగా హీరోయిన్లకు ఈ బెడద ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ టైమ్‌లో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకొని టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది. టాప్‌ హీరోలందరి సరసన నటించి అందరు హీరోల అభిమానులకు ఇష్టమైన హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె ఎవరో కాదు, శ్రీలీల(Sreeleela)

ఇప్పుడు శ్రీలీల చుట్టూ ప్రేమ ఉచ్చును బిగించే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్సే దానికి కారణం అని తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినపుడు..

‘నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అందంగా లేకపోయినా నేను పట్టించుకోను. నా సినిమా కెరీర్‌పై గౌరవం ఉండాలి. ప్రేమతో నన్ను ప్రోత్సాహిస్తూనే సరదాగా, నిజాయితీగా ఉండే వ్యక్తి నాకు తారసపడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను’ అంటూ తన మనసులోని మాటను తెలియజేసింది శ్రీలీల.

Also Read:‘బాహుబలి’లో శివగామిగా శ్రీదేవి.. షాక్‌ అయిన రమ్యకృష్ణ!

ఇదిలా ఉంటే.. శ్రీలీల మాట్లాడిన మాటల్ని కొంత వక్రీకరించి వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ప్రేమ, పెళ్లి గురించి ఆమె వివరంగా చెప్పడం చూస్తుంటే.. లవ్‌లో ఉందేమో.. అందుకే అలాంటి కామెంట్స్‌ చేసిందంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. బలవంతంగా ఆమెను ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది మొదటి స్టెప్‌ అనుకుంటే.. రాబోయే రోజుల్లో శ్రీలీల లవర్‌ ఇతనే అంటూ ఎవరో ఒకర్ని చూపించే ప్రమాదం కూడా ఉందనిపిస్తోంది. ఎంతో నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో శ్రీలీల చెప్పిన మాటలపై కొందరు నెటిజన్లు ఎంతో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తను లవ్‌లో ఉన్నానంటూ వస్తున్న రూమర్లపై శ్రీలీల ఎలా సందిస్తుందో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.