చిరంజీవి మూవీలో కార్తీ! ప్లాన్ అదిరింది బాసు
on Oct 27, 2025

ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. ఏ భాషకి సంబంధించిన చిత్రమైనా, సదరు చిత్రానికి సంబంధించిన కథ, కథనం,నటీనటులు వంటి విషయాల్లో పాన్ ఇండియా సువాసనలని మేకర్స్ అద్దుతున్నారు. మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ప్రస్తుతం 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)కి సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకుడు కావడంతో అభిమానులతో పాటుప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా బాబీ దర్శకత్వంలో మూవీకి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం అధికార ప్రకటన రోజు 'బ్లడీ బెంచ్‌మార్క్ సెట్ చేసిన బ్లేడ్' అనే క్యాప్షన్ తో రక్తం కారుతున్న చిలుక ఆకారం ఒక పదునైన గొడ్డలి చూపిస్తు రిలీజ్ చేసిన పోస్టర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతునట్టుగా తెలుస్తుంది.
ఇందుకు నిదర్శనంగా ఈ ప్రాజెక్ట్ లోకి తమిళ అగ్రహీరోల్లో ఒకడైన 'కార్తీ'(karthi)జాయిన్ అవ్వబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కథ ప్రకారం చిరంజీవికి ధీటుగా ఒక క్యారక్టర్ ఉందని, సదరు క్యారక్టర్ లో పేరున్న హీరో చేస్తే బాగుంటుందని చిత్ర బృందం కార్తీ వైపు మొగ్గు చూపించిందని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.కార్తీ సుదీర్ఘ కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తన సత్తా చాటుతు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వార్త నిజమైతే చిరంజీవి, కార్తీ అభిమానులకే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులకి ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. కార్తీ ప్రస్తుతం 'వా వాతియార్' అనే తన కొత్త చిత్రంతో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
బాబీ,చిరంజీవి కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' లో చిరంజీవి, రవితేజ(Raviteja)కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అన్నదమ్ములుగా కనపడి అభిమానులని అలరించారు. ఈ నేపథ్యంలో కూడా చిరంజీవి, కార్తీ ఎలా కనిపించబోతారనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. ఇక బాబీ(Bobby)ఈ చిత్రాన్ని వాల్తేర్ వీరయ్యని మించి సక్సెస్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుండగా 2027 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బాబీ తన గత చిత్రం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)తో డాకు మహారాజ్ చేసి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



