English | Telugu

ఈ సంక్రాంతికి 'సూప‌ర్‌' వార్‌

మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలుగు చిత్ర‌సీమ‌కు రారాజులుగా వెలిగిపోతున్నారు. పారితోషికం విష‌యంలోనూ, క్రేజ్ విష‌యంలోనూ, అభిమానగ‌ణం విష‌యంలోనూ ఎవ్వ‌రికీ ఎవ్వ‌రూ తీసిపోరు. వీరి సినిమాలు విడుద‌ల అవుతున్నాయంటే బాక్సాఫీసుకు పండ‌గే. అలాంటిది మ‌హేష్, ప‌వ‌న్ ఇద్ద‌రూ ఒకేసారి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఢీ కొట్టుకొంటే ఎలా ఉంటుంది...? పండ‌గ‌ల‌న్నీ ఫ్యామిలీ ప్యాక్ ఆఫ‌ర్‌లా వ‌చ్చేసినంత సంబ‌రంగా ఉంటుంది. ఈ క‌ల త్వ‌ర‌లోనే నిజం కాబోతోంది. మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం, ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మ‌హేష్ - శ్రీ‌కాంత్ అడ్డాల కాంబినేష‌న్లో బ్ర‌హ్మోత్స‌వం ప‌ట్టాలెక్కేసింది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. మ‌రోవైపు గ‌బ్బ‌ర్ సింగ్ 2 కూడా స్టార్ట‌య్యింది. దీనికీ ముహూర్తం ఫిక్స‌య్యింది. ఈసినిమానీ సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని ప‌వ‌న్ ఫిక్స‌య్యాడ‌ట‌. అంటే 2016 సంక్రాంతి.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఇద్ద‌రు స్టార్ల సూప‌ర్ వార్ చూసేయొచ్చ‌న్న‌మాట‌. మ‌హేష్‌కి సంక్రాంతి సీజ‌న్ బాగానే క‌లిసొచ్చింది. ప‌వ‌న్ కూడా ఈ యేడాది సంక్రాంతికే గోపాల గోపాల హిట్ ఇచ్చాడు. మ‌రి వీరిద్ద‌రూ ఢీ కొట్టుకొనే 2016 పండ‌క్కి విజేత‌గా నిల‌బ‌డేది ఎవ‌రో..?? నిర్ణ‌యించాల్సింది తెలుగు ప్రేక్ష‌కులే.