English | Telugu

మలబార్ గోల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు

మలబార్ గోల్డ్ కంపెనీకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నారట. ప్రముఖ హీరో మహేష్ బాబు ఈ మధ్య బ్రాండ్ అంబాసిడర్ గా యమ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఆరు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, ఆ ఖాతాలో ఇప్పుడు మరొకటి వచ్చి చేరింది. మహేష్ బాబు మలబార్ గోల్డ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారటానికి కారణం నాగార్జున అని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం కళ్యాణ్ జ్యూయెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.


ఇది గమనించిన మలబార్ గోల్డ్ కంపెనీ మహేష్ బాబుని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నిక చేసిందని సమాచారం. మహేష్ బాబు మలబార్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం వల్ల ఆ కంపెనీ అమ్మాకాలు మన ఆంధ్రాలో పెరుగుతాయని ఆ మలబార్ గోల్డ్ కంపెనీ బలంగా నమ్ముతోంది. ఈ మలబార్‍ గోల్డ్ కంపెనీకి ఇక్కడ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా కాగా, కేరళలో ప్రముఖ మళయాళ హీరో మోహన్ లాల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.