English | Telugu

మ‌హేష్‌కి డ‌బ్బంటే ఆశ ఎక్కువే సుమీ..?!



తెలుగునాట మ‌హేష్ బాబుది చెక్కు చెద‌ర‌ని క్రేజ్‌. దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారంతా మ‌హేష్‌ని పిచ్చ పిచ్చ‌గా ఆరాధిస్తారు. అందుకే మ‌హేష్ అటు ఇమేజ్‌లోనూ, ఇటు క్రేజ్‌లోనూ.... మొత్తానికి పారితోషికంలోనూ నెంబ‌ర్‌వ‌న్‌. ఎంటార్స్‌మెంట్ల విష‌యంలోనూ మ‌హేష్‌కి పోటీ లేదు. సెక‌న్ల‌పాటు క‌నిపించే యాడ్‌లో క‌నిపించాలంటే కోట్లు ధార‌బోయాల్సిందే. ఆఖ‌రికి అవార్డు ఫంక్ష‌న్ల‌కు రావాల‌న్నా.. మ‌హేష్ అడిగింది ఇవ్వాల్సిందే. ఇప్పుడు తానా వేడుక‌ల్లో పాల్గొన‌వ‌ల‌సిందిగా మ‌హేష్‌కి ఆహ్వానం అందింది. అమెరికాలోని తెలుగువాళ్లంతా క‌ల‌సిక‌ట్టుగా నిర్వ‌హించుకొనే వేడుక‌.. తానా ఉత్స‌వాలు. ఇందుకోసం తెలుగు ప్ర‌ముఖుల్ని ఆహ్వానించి.. అక్క‌డ స‌న్మానిస్తారు. మ‌హేష్‌కి అమెరికాలోనూవిప‌రీత‌మైన క్రేజ్‌. అందుకే ఈసారి మ‌హేష్‌తో ఈ వేడుక నిర్వ‌హించాల‌ని తానా క‌మీటీ భావిస్తోంది. అయితే ఇందుకోసం మ‌హేష్ రూ.3 కోట్లు డిమాండ్ చేశాడ‌ట‌. ఇంత‌కీ అక్క‌డ ఉండాల్సింది మూడు గంట‌లు మాత్ర‌మే. అంటే మ‌హేష్ సంపాద‌న గంట‌కు కోటి అన్న‌మాట‌. వారెవ్వా... మ‌హేషా.. డబ్బంటే ఇంత ఆశా..?? మ‌రి తానా వాళ్లు ఈ బేరం ఎంత‌కు తెగ్గొడ‌తారో చూడాలి.


కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.