English | Telugu

జానీ మాస్టర్ ని ఆ  జైలుకే ఎందుకు తరలించారు

 

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్(jani master)ని పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆల్రెడీ పోక్సో కేసు కూడా నమోదు కావడంతో ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ని ప్రవేశ పెట్టడం జరిగింది.దీంతో  జానీ మాస్టర్ ని కస్టడీ కి కోరుతు పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ కి కోర్టు తమ ఆమోదాన్ని తెలిపింది.

కోర్టు పధ్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు జానీ మాస్టర్ ని చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో  వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ ఖైదీ గా చర్లపల్లి జైలులోనే ఉండనున్నాడు. కోర్టులో ప్రవేశపెట్టడానికంటే ముందే  పోలీసులు జానీ మాస్టర్ ని విచారించగా పలు సంచలన విషయాలు బయటకి వచ్చినట్టుగా  తెలుస్తుంది. ఆ అమ్మాయి పై ఎలాంటి  లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కావాలనే కొందరు ఆ అమ్మాయి ద్వారా ఫిర్యాదు చేయించి నాపై తప్పుడు కేసు నమోదు చేయించారు. నేను లీగల్ గానే పోరాడుతా, నిజాయితీగా బయటకి వస్తాను. నన్ను ఇరికించిన వారిని మాత్రం  వదలనని జానీ మాస్టర్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.