English | Telugu
ఖైదీ2 గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్!
Updated : Aug 19, 2023
లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ సినిమా లియో. దళపతి విజయ్, సంజయ్‌దత్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు దాదాపు 400 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. దీంతో లోకేష్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సినిమా తర్వాత లోకేష్ తలైవర్ 171ని డైరక్ట్ చేస్తారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా వెల్లడించారు. అంతే కాదు, ఈ సినిమా తర్వాత అతను ఖైదీ సీక్వెల్ ఖైదీ2ని చేస్తారు. అయితే, కోడంబాక్కం న్యూస్ ప్రకారం ఈ లైనప్‌లో పెద్ద మార్పు కనిపిస్తోంది. ఖైదీ2 సినిమా చేయాల్సిన కాల్షీట్లలో లోకేష్ మరో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారట. ఆ సినిమా పేరు రోలెక్స్. సూర్య హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కిస్తుంది.
కమల్‌హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో రూత్‌లెస్ విలన్‌గా నటించారు సూర్య. ఆ కేరక్టర్ పేరే రోలెక్స్. ఇప్పుడు ఆ కేరక్టర్ ఆధారంగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.రీసెంట్‌గా రోలెక్స్ సినిమా గురించి సూర్య కూడా మెన్షన్ చేశారు. ఈ సినిమా తర్వాత లోకేష్‌తో ఇరుంబు కై మాయావి అనే మూవీ కూడా చేయబోతున్నట్టు తెలిపారు. అయితే, ఖైదీ 2 లేదన్నది కార్తి ఫ్యాన్స్ కి మాత్రం చేదు వార్తే. ఎందుకంటే ఆయన్ని ఢిల్లీ రోల్‌లో ఇంకో సారి చూడటానికి తహతహలాడుతున్నారు ఫ్యాన్స్. అందరికీ తెలిసిన ఈ విషయాన్ని లోకేష్ కూడా కన్సిడర్ చేస్తారనే టాక్ కూడా ఒకటి నడుస్తోంది. ఈ సినిమాలో సూర్య, కార్తి ఇద్దరూ ఉండేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నారట. రోలెక్స్, ఢిల్లీ కేరక్టర్లను కలిపి లోకేష్ ఓ స్క్రిప్ట్ చేశారనే మాటలు కూడా నడుస్తున్నాయి. 2024 ఆఖరునగానీ, 2025 ప్రారంభంలోగానీ, ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.