English | Telugu

సమంత చెప్పులు చూపించింది..!

సమంత చెప్పులు చూపించింది అంటే మరో కాంట్రవర్సిలో ఇరుక్కుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే పోరపాటు పడినట్లే..! టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న సమంత కొన్ని రోజుల క్రితం పారగాన్‌ చెప్పులు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. దీంతో తన అభిమానులను కూడా పారగాన్‌ చెప్పులు వాడండీ అంటూ పిలుపునిస్తోంది. అయితే తాజాగా తెలుగు యాక్టర్ బ్రహ్మాజీ కారులో వెళుతుంటే ..పారగాన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న సమంత ఫ్లెక్సీ బస్‌కు అంటించి ఉండగా ఆయన చూసారట. దీంతో '' నేను నిన్ను ఫాలో అవుతున్నాను.. దయచేసి చెప్పులు చూపొద్దు " అంటూ సమంతపై సరదా ట్వీట్ వేశాడట. ఈ విషయం తెలియక మొదట సమంత అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు కంగారు పడ్డారట. అసలు విషయం తెలిసి అందరూ నవ్వుకున్నారట!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.