English | Telugu

ఇకపై అలా చేయనంటున్న సమంత!

స్టార్ డం వచ్చాక నటీనటులు అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా తాము చేసే పాత్రలను ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చేస్తుంటారు. దీని కోసం అదిరిపోయే ఆఫర్లను కూడా వదిలేసుకుంటుంటారు. క‌థ‌ల‌, పాత్ర‌ల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంటారు. తాజాగా సమంత ఈ మధ్యకాలంలో కొన్ని పాత్రలను సున్నితంగా రిజెక్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి పుష్ప మూవీలో ఈమె ఊ అంటావా మామ పాట‌తో బాక్సాఫీసు వద్ద ఎంత ర‌చ్చ చేసిందో తెలిసిందే. ఈ పాట ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో విదిత‌మే. బాలీవుడ్ మార్కెట్ లోనూ ఈ పాట త‌న హవాచూపించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ సమంతాకు దేశంలోనే ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ లో వ‌రుస అవకాశాలను అందుకుంది. అయితే మయోసైటిస్ వ్యాధి కారణంగా చాలా రోజులు ఇంటికే పరిమితమైంది. ప్రస్తుతం కోలుకొని సీటాడెల్ వెబ్ సిరీస్ లో షూటింగ్‌లో పాల్గొంటుంది.

ముంబైలో ఇటీవలే ఓ లగ్జరీ ప్లాట్ కొనుగోలు చేసింది. అక్కడే ఉంటూ టాలీవుడ్ ఆఫర్స్ ను అంతగా ఒప్పుకోవడానికి ప్రస్తుతం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. పుష్ప 2 ది రూల్ చిత్రంలో న‌టించాల్సిందిగా ఆమెని మేక‌ర్స్ అయిన సుకుమార్, మైత్రి మూవీ మేక‌ర్స్ కోరిన‌ప్ప‌టికీ ఆమె నో చెప్పింద‌ట‌. ఊ అంటావా మామా.. వంటి ఇంకా అదిరిపోయే ఐటం సాంగ్ కోసం ఆమెని సంప్ర‌దిస్తే నో అనే స‌మాధానం వ‌చ్చింద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో కూడా తాను ఊ అంటావా టైప్ లో ఓ పాట‌లో న‌టిస్తే ఇక త‌న‌కు ఇలాంటి అవ‌కాశాలే వ‌స్తాయ‌ని, త‌న‌పై ఓ ముద్ర ప‌డుతుంద‌ని భావించ‌డంతోనే ఆమె మేకర్స్ చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించిందట.

నాని నటించిన దసరా చిత్రం త్వరలో విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన చిత్ర సాంగ్స్ టీజర్స్ ప్రేక్షకుల‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా బాగా హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ మూవీ టీం కూడా కొంతకాలం క్రితం తమ సినిమాలో నటించాలని సమంతాను సంప్రదించారట. దీన్ని కూడా ఆమె కూల్ గా రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. మొత్తానికి కమర్షియల్ రెగ్యులర్ పాత్రలను ఆమె అంగీకరించడం లేదని తెలుస్తోంది. వాటిని పక్కనపెట్టి విభిన్న పాత్ర‌ల‌కు, సినిమాల‌కు మాత్రమే ఓకే అంటుంది. బాలీవుడ్ పైనే పూర్తి ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయింది. ఒకసారి న‌టించిన పాత్ర‌లో మ‌రోసారి న‌టించ‌కూడ‌ద‌ని, ఒకే ర‌క‌మైన స్టీరియో టైప్ పాత్ర‌ల‌ను ప‌క్క‌న పెట్టాలని, ఎంత పారితోషికం ఇచ్చినా కూడా వాటికి అంగీకారం తెలుప‌కూడ‌ద‌ని ఆమె ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆమె తెలుగులో నటించిన శాకుంతలం ఏప్రిల్ లో పరీక్షల ముందుకు రానుంది. ఇక శివానిర్వాన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఖుషీ చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.