English | Telugu

వై.యస్.ఆర్. కాంగ్రెస్ లో సూపర్ స్టార్ కృష్ణ

వై.యస్.ఆర్. కాంగ్రెస్ లో సూపర్ స్టార్ కృష్ణ చేరుతున్నారనటానికి బలమైన సంకేతాలు అందుతున్నాయి. వివరాల్లోకి వెళితే సూపర్ కృష్ణ శ్రీమతి, గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకున్న దర్శకురాలు, నిర్మాత, నటి అయిన శ్రీమతి విజయనిర్మల, తన కుమారుడు, నటుడు అయిన నరేష్ తో కలసి ఇటీవల వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్.ఆర్. తనయుడు అయిన వై.యస్. జగన్మోహన్ రెడ్డిని గుంటూరులో కలిశారు. ఆ భేటీ సుమారు గంట సేపు సాగిందనీ, వారి మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయనీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

దీన్ని బట్టి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించిన సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇప్పుడు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరతారనటానికి విజయనిర్మల, నరేష్ వెళ్ళి వై.యస్.జగన్ తో కలవటం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందనీ, రాష్ట్రాన్ని కాపాడాలంటే యువరక్తం కావాలనీ, అందుకే వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేతను తాము కలిశామనీ విజయనిర్మల మీడియాకు తెలిపారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.