English | Telugu
కింగ్ ఆఫ్ కోతా నేనే అంటున్న దుల్కర్
Updated : Feb 22, 2023
కింగ్ ఆఫ్ కోతా సినిమా షూటింగ్ పూర్తయింది. దమ్ముంటే నన్ను ఫినిష్ చేసి చూడు అంటూ సినిమా షూటింగ్ పూర్తయిన విషయాన్ని చమత్కారంగా చెప్పారు దుల్కర్ సల్మాన్. ప్యాన్ ఇండియా ఆర్టిస్ట్‌గా ఎదుగుతున్నారు దుల్కర్ సల్మాన్. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేస్తున్న లేటెస్ట్ సినిమా కింగ్ ఆఫ్ కోతా. నిన్నమొన్నటిదాకా మలబారుతీరంలో పక్కింటబ్బాయి తరహా రోల్స్ చేసిన దుల్కర్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు.
అభిలాష్ జోషిలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫైనల్ షూటింగ్ ఇటీవల కారైకుడిలో జరిగింది. షూటింగ్ పూర్తయిన విషయాన్ని దుల్కర్ అభిమానులతో పంచుకున్నారు. ''మీవల్లయితే నన్ను ఫినిష్ చేయండి'' అనే క్యాప్షన్‌తో తన టీమ్ అందరితో తీసుకున్న క్లిప్‌ని షేర్ చేశారు. సినిమా ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే మొదలవుతాయని అన్నారు. జీ స్టూడియోస్ కింగ్ ఆఫ్ కోతాను నిర్మిస్తోంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
లాస్ట్ ఇయర్ సీతారామమ్, చుప్ సినిమాలతో బెస్ట్ హిట్స్ అందుకున్నారు దుల్కర్ సల్మాన్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డుల్లో దుల్కర్ సల్మాన్‌కి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. చుప్‌లో ఆయన చేసిన నెగటివ్ కేరక్టర్‌కి ఈ అవార్డు ఇచ్చారు నిర్వాహకులు. హీరోగానూ, నెగటివ్ షేడ్స్ లోనూ మెప్పిస్తున్నారు దుల్కర్.