English | Telugu

క‌త్రినా కైఫ్... 2023లో చాలా బిజీ గురూ!

క‌త్రినా కైఫ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2023లో ఆమె డైరీ ఎలా ఉంది? ఎన్నిసార్లు మీడియా ముందుకు వ‌స్తారు? అస‌లు ఎన్ని సినిమాల రిలీజులున్నాయి? అని లెక్క‌లేసుకుంటున్నారు ఆమె ఫాలోయ‌ర్స్.క‌త్రినా కైఫ్‌కి ఈ ఏడాది చాలా హెక్టిక్ ఇయ‌ర్‌. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజులకున్నాయి. స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న టైగ‌ర్‌3లో క‌త్రినా కైఫ్ నాయిక‌.ఈ ఏడాది ఆల్రెడీ ప‌ఠాన్‌తో సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్‌ని టేస్ట్ చేసిన య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ తెర‌కెక్కిస్తున్న స్పై థ్రిల్ల‌ర్ ఇది. ఆల్రెడీ ప‌ఠాన్‌లో స‌ల్మాన్ క‌నిపించారు. నీకోసం వెయిట్ చేస్తుంటా అని టైగ‌ర్ రోల్ చెప్ప‌డంతో, టైగ‌ర్‌3లో షారుఖ్ గెస్ట్ అప్పియ‌రెన్స్ కూడా క‌న్‌ఫ‌ర్మ్ అయింది.

టైగ‌ర్ 3లో క‌త్రినా స్పై జోయాగా క‌నిపిస్తారు. టైగ‌ర్ ఫ్రాంఛైజీలో ఏక్‌థా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హైలో క‌త్రినా పెర్ఫార్మెన్స్ కేక అంటూ ప్ర‌శంస‌లు కురిశాయి.ఇప్పుడు ఇమ్రాన్ హ‌ష్మి టైగ‌ర్‌3లో విల‌న్‌గా క‌నిపిస్తారు. ఈద్‌కి విడుద‌ల కానుంది ఈ సినిమా.టైగ‌ర్‌3తో పాటు ప్రియాంక చోప్రా సినిమా జీ లే జరా కూడా 2023లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో ఆలియా భ‌ట్ కీ రోల్ చేస్తున్నారు.జోయా అక్త‌ర్ 2011లో చేసిన జింద‌గీ నా మిలేంగే దుబారా అనే సినిమా త‌ర‌హాలో ఉంటుంది. రోడ్ ట్రిప్ సినిమా ఇది. ముగ్గురు అమ్మాయిల రోడ్ ట్రిప్‌ని ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు.

ఈ చిత్రంక‌న్నా ముందే మెరీ క్రిస్‌మ‌స్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టించారు క‌త్రినా కైఫ్‌. లాస్ట్ ఇయ‌ర్ విడుద‌ల కావాల్సిన ఈ సినిమా, ఈ ఏడాదికి పోస్ట్ పోన్ అయింది.విజ‌య్ సేతుప‌తి, క‌త్రినా ఇద్ద‌రూ గ్రే షేడ్స్ ఉన్న రోల్స్ చేశార‌ని వినికిడి. శ్రీరామ్ రాఘ‌వ‌న్ డైర‌క్ట్ చేశారు. ఈ సినిమాను డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.