English | Telugu

త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లోకి రానున్న ‘ధ్రువ‌న‌క్ష‌త్రం’

స్పై థ్రిల్ల‌ర్లకు గుడ్ టైమ్ న‌డుస్తోంది. లాస్ట్ ఇయ‌ర్ మ‌న ద‌గ్గ‌ర స‌ర్దార్‌, ఇప్పుడు నార్త్ లో ప‌ఠాన్ సూప‌ర్‌డూప‌ర్ సక్సెస్ కావ‌డంతో అంద‌రికీ స్పై థ్రిల్ల‌ర్ జోన‌ర్ మీద మ‌న‌సు మ‌ళ్లుతోంది. త‌మ సినిమా రిలీజ్‌కి కూడా ఇదే ప‌ర్ఫెక్ట్ టైమ్ అని ఫిక్స్ అయ్యారు ధ్రువ‌న‌క్ష‌త్రం మేక‌ర్స్. చియాన్ విక్ర‌మ్ హీరోగా న‌టించిన సినిమా ధ్రువ‌న‌క్ష‌త్రం. గౌత‌మ్ సుదేవ‌మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2017లో ప్రీ ప్రొడ‌క్ష‌న్‌తో మొద‌లైంది ధ్రువ‌న‌క్ష‌త్రం సినిమా. ప్రీ ప్రొడ‌క్ష‌న్‌కే ఎక్కువ స‌మ‌యం తీసుకున్నారు గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌. న‌టీన‌టుల ఎంపికలో కూడా మార్పులు జ‌రిగాయి. మొద‌ల‌య్యాకైనా వ‌రుస‌గా సినిమా షూటింగ్ జ‌రిగిందా? అంటే అదీ లేదు. ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల ఆగిపోయింది.

డైర‌క్ట‌ర్ గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్‌కీ, ప్రొడ‌క్ష‌న్ హౌస్‌కీ మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సుల మ‌ధ్య కొన్నాళ్లు హాల్ట్ ప‌డింది. ఇన్ని ఇబ్బందుల‌ను దాటుకుని ఇప్పుడు ధ్రువ‌న‌క్ష‌త్రం సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్యాచ్ వ‌ర్క్ మొద‌లుపెట్ట‌బోతున్నార‌ట గౌత‌మ్‌.ఆల్రెడీ కొంత చేసినా, మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి, సైమ‌ల్‌టైనియ‌స్‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా మొద‌లుపెట్టాల‌నుకుంటున్నార‌ట‌. సినిమా అన్ని సార్లు వాయిదా ప‌డ్డ‌ప్ప‌టికీ, క‌థ‌, ప్రాజెక్ట్ షేప్ అయిన తీరు ఆస‌మ్ అంటున్నారు యూనిట్ మెంబ‌ర్స్.

ఆ కాన్ఫిడెన్స్ తోనే ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా విక్ర‌మ్ కొత్త పోస్ట‌ర్‌ని లాంచ్ చేసింది.ఈ చిత్రంలో ముందు సూర్య న‌టిస్తార‌ని అనుకున్నారు. కానీ త‌న‌కు చాలా క‌మిట్‌మెంట్స్ ఉండ‌టం వ‌ల్ల సూర్య త‌ప్పుకున్నారు. ప‌ది మంది సీక్రెట్ ఏజెంట్ల‌తో కూడిన నేష‌న‌ల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్క‌తోంది. ఈ టీమ్‌కి హెడ్‌గా క‌నిపిస్తారు విక్ర‌మ్‌. రాధికా శ‌ర‌త్‌కుమార్‌, సిమ్ర‌న్‌, పార్తిబ‌న్‌, దివ్య‌ద‌ర్శిని, మున్న‌, వంశీకృష్ణ కీల‌క పాత్ర‌ధారులు. హారిస్ జైరాజ్ సంగీతాన్ని అందించారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.