English | Telugu

ప్రభాస్ రాముడిలా కాదు కర్ణుడిలా కనిపిస్తున్నాడు!

'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ ని చూస్తుంటే రాముడిలా కనిపించడం లేదని, కర్ణుడిలా కనిపిస్తున్నాడని నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తుండగా, ప్రభాస్ అభిమానులు మాత్రం ఆమెపై మండిపడుతున్నారు.

రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్'. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనువిందు చేయనున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో టి.సిరీస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించిన తీరుని కొందరు తప్పుబట్టారు. రాముడికి మీసాలు, గడ్డలు ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా కస్తూరి సైతం ఇదే అభిప్రాయపడ్డారు. రామలక్ష్మణులను మీసాలు, గడ్డాలతో చూపించిన సంప్రదాయం ఎక్కడైనా ఉందా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రను అద్భుతంగా పోషించిన లెజెండ్స్ ఉన్నారు.. కానీ 'ఆదిపురుష్'లో ప్రభాస్‌ రాముడిలా కాకుండా కర్ణుడిలా కనిపిస్తున్నాడు అంటూ కస్తూరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.