English | Telugu

యన్ టి ఆర్ పెళ్ళి సెట్ ఖర్చు 18 కోట్లు

యన్ టి ఆర్ పెళ్ళి సెట్ ఖర్చు 18 కోట్లు అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రముఖ యువ హీరో యంగ్ టైగర్ కి నార్నే శ్రీనివాసరావు ఏకైక కుమార్తె లక్ష్మీ ప్రణీతతో "మే" నెలలో అయిదవ తేదీన తెల్లవారు ఝామున రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు హైదరాబాద్ హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్లో అత్యంత వైభవంగా జరుగనుంది.

ఈ వివాహాన్ని కనీ వినీ ఎరుగని రీతిలో ఘనంగా జరగాలని అన్ని విషయాలనూ చాలా పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తున్నారు. ఈ వివాహ వేదికను నిర్మించటానికి అయ్యే ఖర్చు పద్ధెనిది కోట్ల రూపాయలని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. అంటే ఆ వేదికపైకి వధూ వరులను ఆశీర్వదించటానికి వచ్చే సినీ, రాజకీయ ప్రముఖులందరు రావటానికి పోవటానికి కూడా చాలా అనుకూలంగా, చాలా సౌకర్యవంతంగా ఉండేలా చాలా రిచ్ గా, విశాలంగా ఈ వేదిక ఉండబోతోందట.

ఇక ఈ యన్ టి ఆర్ పెళ్ళికి ఆహ్వానించే కార్డు ఖరీదు మూడువేల రూపాయలని తెలిసింది. ఇక ఈ పెళ్ళిలో వడ్డించే భోజనం వివరాలు వింటే ఆశ్చర్యపోతారు. చక్కని తెలుగు సాంప్రదాయ భోజనంతో పాటు ఊహించనన్ని దేశవిదేశాలకు చెందిన స్వీట్లు, హాట్లు, పళ్ళు కూడా ఆహూతులను అలరించనున్నాయి. వివాహం అచ్చ తెనుగు ఆచారవ్యవహారాలతో, చక్కని తెనుగు సాంప్రదాయబద్ధంగా సశాస్త్రీయంగా జరుగనుందనీ సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.