English | Telugu
అప్పుడు 'ఆంధ్రావాలా', 'శక్తి'.. ఇప్పుడు 'ఎన్టీఆర్ 30'!
Updated : Apr 9, 2023
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
'ఎన్టీఆర్ 30'లో తారక్ తండ్రిగా, కొడుకుగా రెండు పాత్రలు పోషించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ గతంలో కూడా 'ఆంధ్రావాలా', 'శక్తి' సినిమాల్లో తండ్రిగా, కొడుకుగా డ్యూయల్ రోల్ చేశాడు. అయితే ఆ రెండు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మిలిగాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి తండ్రికొడుకులుగా నటిస్తున్నాడనే న్యూస్ ఆయన ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఆ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.