English | Telugu
రామ్ చరణ్ సినిమాకి బిగ్ నెగటివ్ సెంటిమెంట్!
Updated : Apr 9, 2023
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'ను చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. అయితే ఈ వార్త విని చరణ్ అభిమానులు ఓ వైపు ఆనందపడుతూనే మరోవైపు ఆందోళన చెందుతున్నారు.
ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజం సంగీతం అందించడం గుడ్ న్యూసే. అయితే తెలుగులో ఆయన ట్రాక్ రికార్డే ఫ్యాన్స్ కి కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా రెహమాన్ సంగీతం అందించిన టాలీవుడ్ స్టార్ల సినిమాలేవీ విజయం సాధించలేదు. వెంకటేష్ 'సూపర్ పోలీస్', మహేష్ బాబు 'నాని', పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' సినిమాలకు రెహమాన్ సంగీతం అందించగా.. ఆ మూడు సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఆ నెగటివ్ సెంటిమెంటే చరణ్ ఫ్యాన్స్ ఆందోళనకు కారణమైంది. మరి చరణ్ ఈ నెగటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడేమో చూడాలి.