English | Telugu

సందీప్ కిష‌న్ తో విజయ్ తనయుడి మూవీ.. మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌!

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న‌ట్లు లైకా సంస్థ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో సందీప్ కిష‌న్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జికెఎం త‌మిళ్ కుమ‌ర‌న్ మాట్లాడుతూ.. " జాసన్ సంజయ్‌ను తెర‌కెక్కించబోతున్న క‌థ, ఆయ‌న నెరేష‌న్ విన్న‌ప్పుడు డిఫ‌రెంట్‌గా అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్ర‌ధాన‌మైన పాయింట్‌ ఉంది." అన్నారు.

ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. 2025 జ‌న‌వ‌రి నుంచి మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.