English | Telugu

జానకీరామ్ మృతిపై వైద్యుల నివేదిక

నందమూరి జానకీరామ్ మృతిపై ఉస్మానియా వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అతనికి ఆక్సిజన్ తో పాటు బ్లడ్ పంపింగ్ ఆగిపోవడంతో జానకీరామ్ మృతిచెందినట్లుగా వెల్లడించారు. తల, ఛాతి, పొట్టభాగాల్లో బలమైన గాయాలు కావడంతో పాటు బ్లడ్ పంపింగ్ చేసే రక్తనాళాలు పగిలిపోయాయని, కుడిచేయితో పాటు కాలు కూడా విరిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. పక్కటెముకలు బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. అతివేగంగా ఢీకొట్టడంతో శరీరంలోని అన్ని భాగాలు దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. జానకీరామ్ మృతితో హరికృష్ణ కుటుంబం షోకసంద్రంలో మునిగింది. ఇంటిపెద్దకుమారుడి మరణవార్త విన్న హరికృష్ణ కుప్పకూలి విలపిస్తున్నాడు. జానకీరామ్ భౌతికకాయానికి దగ్గుబాటి దంపతులు, పలువురు సినీ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.