English | Telugu

పవన్ కళ్యాణ్ నివాళులు...చిరు కంటతడి

రోడ్డుప్రమాదంలో మరణించిన సినీ నటుడు నందమూరి హరికృష్ణ పెద్దకుమారుడు నందమూరి జానకీరామ్ మృతదేహానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవిలు నివాళులు అర్పించారు. ఆదివారం ఆయన హరికృష్ణ నివాసం వద్దకు వచ్చిన చిరు, పవన్ నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు. జానకిరాం భౌతికకాయాన్ని చూసి చిరంజీవి కంటతడిపెట్టారు. జానకిరామ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... వాహనాదారులు, యువత ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.వాహనాలు నడుతున్నప్పుడు హెల్మెట్, సీటు బెల్టు వంటి నియమాలను తప్పక పాటించాలని తెలిపారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.