English | Telugu

ప్రీ రిలీజ్ బిజినెస్ లో జననాయగన్ రికార్డు

-జననాయగన్ రికార్డు
-విజయ్ అభిమానుల హంగామా
-ప్రీ రిలీజ్ లో రికార్డు
-మూవీ ఎలా ఉండబోతుంది

సిల్వర్ స్క్రీన్ కోసం, అభిమానుల కోసం, పాన్ ఇండియాప్రేక్షకులని రంజిప చెయ్యడం కోసం కొంత మంది స్టార్ హీరోలు ఈ భూమ్మీదకి వస్తారు. అటువంటి ఒక అరుదైన సూపర్ స్టార్ 'దళపతి విజయ్'(Vijay). తన సినీ ప్రస్థానం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నిత్యం విజయ్ కి సంబంధించిన సినిమాల గురించి గూగుల్ లో సెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం 'జననాయగన్' అనే మూవీ చేస్తున్నాడు. తెలుగులో 'జననాయకుడు'పేరుతో రిలీజ్ కానుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంతో పాటు జననాయగన్ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ తో మూవీలో పొలిటికల్ సువాసనలు తారాస్థాయిలోనే ఉండనునున్నాయనే విషయం అర్ధమవుతుంది. దీంతో అభిమానులతో పాటుప్రేక్షకులు 'జననాయగన్'(Jana Nayagan)రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


జనరల్ గా విజయ్ సినిమా అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుందనే విషయం తెలిసిందే. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా సదరు బిజినెస్ సినిమా సినిమాకి పెరుగుతుంటుంది. ఇప్పుడు అదే తరహాలో జన నాయగన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. సినీ ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం తమిళనాడు ధియేటరికల్ హక్కులు 110 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 80 కోట్లు, ఆడియో రైట్స్ 35 కోట్లు, ఓటీటీ హక్కులని అమెజాన్ ప్రైమ్ 120 కోట్లకి పొందినట్టుగా టాక్. తెలుగు, కన్నడ రిలీజ్ హక్కుల విషయంలో ఎలాంటి న్యూస్ రాకపోయినా, భారీ రేట్స్ నే దక్కించుకోవడం ఖాయం. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే దగ్గర దగ్గరగా 350 కోట్లు దాకా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మూవీ బడ్జెట్ అయితే సుమారు 300 కోట్లు అనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది.

also read: త్రివిక్రమ్ నిర్మాతగా కాంతార తరహాలో కొరగజ్జ.. ఎక్కడి దైవమో తెలుసా!

ఇప్పుడు జననాయగాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ న్యూస్ సోషల్ మీడియాలో రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేస్తుకుంటున్నారు. మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి 1000 కోట్లు వసూలు చేస్తుందనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా జనవరి 9 న థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ స్పీచ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. విజయ్ సరసన పూజాహెగ్డే జత కట్టింది, మమిత భైజు మరో కీలక పాత్రలో కనిపిస్తుంది. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్. హెచ్ వినోద్ దర్శకుడు.