English | Telugu

సత్య హీరోగా జెట్లీ.. ఈ టైంలో అవసరమా..?

కమెడియన్ లు హీరోలుగా మారడం అనేది చూస్తుంటాం. ఆలీ, సునీల్ వంటి కమెడియన్స్ హీరోలుగా హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఈ జనరేషన్ కమెడియన్స్ లో తనదైన కామెడీ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సత్య. ముఖ్యంగా 'మత్తు వదలరా' సినిమాలో అతని కామెడీకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడి సినిమాతోనే సత్య హీరోగా మారుతుండటం విశేషం.

'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఇందులో సత్య హీరోగా నటిస్తున్నాడు.

సత్య హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని తెలుపుతూ మొదట అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు. మనీ సినిమాలోని బ్రహ్మానందం పాత్రను స్ఫూర్తిగా తీసుకొని చేసిన ఆ వీడియోలో.. కమెడియన్ గా బాగానే ఉందిగా లైఫ్, ఈ టైములో హీరో అవ్వడం అవసరమా? అన్నట్టుగా ఫ్రెండ్స్ మాట్లాడతారు. నాకేం తక్కువ.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ దొరికితే హీరో అయ్యి చూపిస్తానని సత్య అంటాడు.

అనౌన్స్ మెంట్ వీడియోతో ఆకట్టుకున్న టీం.. తాజాగా టైటిల్ ని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి 'జెట్లీ' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక పోస్టర్ లో ఫ్లయిట్ మీద నాన్ చాక్ పట్టుకొని బ్రూస్ లీ లాగా సత్య ఫోజ్ ఇవ్వడం ఫన్నీగా ఉంది.

'జెట్లీ' షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కమెడియన్ నుండి కామెడీ హీరోగా మారుతున్న సత్య.. ఈ సినిమాతో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం