త్రివిక్రమ్ నిర్మాతగా కాంతార తరహాలో కొరగజ్జ.. ఎక్కడి దైవమో తెలుసా!
on Nov 14, 2025

-కొరగజ్జ కథ ఏంటి?
-త్రివిక్రమ్ ఏం చెప్తున్నాడు
-తుళునాడు నేపధ్యం ఏంటి
-భారీ అంచనాలు
కన్నడ సినీ సీమలో తెరకెక్కిన కాంతార,కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)సృష్టించిన ప్రభంజనం అందరకి తెలిసిందే. ఇప్పట్లో ఆ రెండు చిత్రాల తాలూకు ప్రభావాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులు మర్చిపోవడం అనేది కొంచం కష్టమే. ఇప్పుడు కాంతార తరహాలోనే మరో సాంస్కృతిక ఆధారిత మూవీ 'కొరగజ్జ' (koragajja)పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రావడానికి వడివడిగా ముస్తాబవుతోంది. కర్ణాటక లోని తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించబడే దైవమే కొరగజ్జ. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి పేరు వచ్చింది. దీంతో కొరగజ్జ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. త్రివిక్రమ్(Trivikram)సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ నిర్మిస్తుండగా సుధీర్ అత్తవర్(Sudheer Attavar)దర్శకుడు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
రీసెంట్ గా మంగళూరులో ఆడియో లాంఛ్ కార్యక్రమం జరిగింది. నటీనటులందరు కొరగజ్జ సంప్రదాయ గెటప్‌లతో కనిపించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత త్రివిక్రమ్ మాట్లాడుతు ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, 3D మోషన్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. కంటెంట్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. దర్శకుడు సుధీర్ అత్తవర్ మాట్లాడుతు 'కన్నడ పరిశ్రమలో పాన్ వరల్డ్ సినిమాలు దశాబ్దాల క్రితమే వచ్చాయి. ‘నాగరహోలి’13 భాషల్లో విడుదలైంది. 'కాంతార’కూడా ఒక గొప్ప కల్చరల్ ప్రెజెంటేషన్. ఇప్పడు మా నుంచి ‘కొరగజ్జ' రాబోతోంది. తులునాడు సంస్కృతి, పూజా సంప్రదాయాన్ని మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు.
also Read: కాంత లో ప్రధాన హైలెట్స్ ఇవే అంటున్న ప్రేక్షకులు
సందీప్ సొపర్‌కర్, శృతి, భవ్య కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.ప్రస్తుతం 'కొరగజ్జ' పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరి కాంతార సిరీస్ తరహాలోనే 'కొరగజ్జ' కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సాదిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



