English | Telugu

జెండా ఎత్తేసిన హీరోయిన్ ఎవ‌రు??

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల కేసు తీగ లాగితే డొంక క‌దులుతోంది. ఎర్ర‌చందనం స్మగ్ల‌ర్ల‌కీ.. ఓ టాలీవుడ్ నిర్మాత‌కూ సంబంధం ఉంద‌ని తాజాగా ఎంక్వైరీలో తేలింది. స్మ‌గ్ల‌ర్లు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పెట్టుబ‌డి పెట్టార‌ని.. ఓ హీరోయిన్‌కి భారీగా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేశార‌ని పోలీసులు నిర్దారించారు. ఆ హీరోయిన్ పంజాబీ ప‌డుచ‌ట‌. ప్ర‌తి నెలా ఆ హీరోయిన్ ఖాతాలో భారీగా డ‌బ్బులు జ‌మ‌వుతూ వ‌చ్చాయ‌ట‌. ఈ విష‌యం తెలుసుకొన్న పోలీసులు ఆమె బ్యాంకు ఖాతాల‌ను స్థంభింప‌చేశారు. అదుపులో తీసుకొని ప్ర‌శ్నించాల‌నుకొంటున్న స‌మ‌యంలోనే ఆ హీరోయిన్ బిజానా ఎత్తేసి అండ‌ర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయింద‌ని టాక్‌. మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌రు?? అనే విష‌యంపై ప‌రిశ్ర‌మ‌లో ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. అగ్ర హీరోల‌తో జ‌ట్టు క‌ట్టి... ఇప్పుడో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న పంజాబీ భామే.. ఆ హీరోయిన్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి నిజానిజాలేమిటో కాల‌మే చెప్పాలి.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.