English | Telugu

రఫ్ఫాడేస్తున్న రకుల్

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ఆ సినిమాతో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీ లో యంగ్ హీరోల హాట్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రకుల్ రవితేజ కిక్-2 లో నటిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఒకేసారి ముగ్గురు టాప్ హీరోల సరసన జోడీకట్టే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్, మహేశ్ బాబు ఈ ముగ్గురు హీరోలు రకుల్ కు తమ సరసన నటించే అవకాశం ఇచ్చారు. రామ్ చరణ్ - శ్రీనువైట్ల, ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్లలో రకుల్ నటిస్తోంది. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేక మహేశ్ బాబు సినిమా 'బ్రహ్మోత్సవం' లో నటించే ఛాన్స్ మిస్సయ్యిందని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. తన స్ఠానంలో సమంత నటించే అవకాశం ఉందనే పుకార్లు జోరుగా వినిపించాయి. దీంతో అలర్ట్ అయిన రకుల్ బ్రహోత్సవంలో హీరోయిన్ ఛాన్స్ తనదేనని ఎట్టి పరిస్థితిలో ఛాన్స్ మిస్ చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. మరి రకుల్ రాపిడ్ స్పీడ్ చూస్తుంటే నంబర్ వన్ ప్లేస్ కు తొందరగానే చేరుకునేట్టు ఉంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.