English | Telugu
సుమన్ ఎందులోనూ లేడంట...!
Updated : Mar 12, 2014
సినీతారలు అందరి కన్ను ఇప్పుడు రాజకీయాలపై పడింది. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఎదో ఒక పార్టీలో చేరిపోతున్నారు. అయితే నటుడు సుమన్ కూడా త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు సుమన్ స్పందిస్తూ... రాష్ట్ర విభజన వల్ల కొందరు ఆనందంతో ఉంటే.. ఇంకొందరు బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి దిగడం సమంజసం కాదు. నేను ఏ పార్టీలోను లేను. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశమే ఉంటే స్వయంగా వెల్లడిస్తాను. వివిధ పార్టీల్లో ఉన్న నా మిత్రులు కూడా నన్ను ప్రచారం చేయమని అడుగుతున్నారు. ఇప్పటివరకు ఏ అభిప్రాయానికి రాలేదు నేను" అని తెలిపారు. ఈ నెలాఖరు వరకూ హిందీ "గబ్బర్" సినిమా షూటింగ్ లో తాను బిజీగా ఉంటానని సుమన్ వెల్లడించారు.