English | Telugu
లిప్ లాక్ లో ప్రిన్స్
Updated : Mar 12, 2014
ఈ మధ్య టాలీవుడ్ లో బాలీవుడ్ సెగ ఎక్కువయ్యింది. మొన్నటివరకు బాలీవుడ్ లో మాత్రమే ఉండే లిప్ లాక్ లు ఇపుడు తెలుగు సినిమాలలో కూడా ఎక్కువ అయిపోయాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండును నటుడు ప్రిన్స్ బాగా వాడుకుంటున్నాడు. ప్రిన్స్, నిఖితా పవార్ జంటగా నటిస్తున్న చిత్రం "డాలర్స్ కాలనీ". ఇటీవలే హీరోహీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. శ్రీ చంద్ ముల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.రత్నమయ్య, టి.గణపతిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిందని, చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. రొమాంటిక్ హారర్ తరహాలో రూపొందుతున్న ఈ చిత్రానికి మల్లిక్ సంగీతం అందిస్తున్నారు.