English | Telugu

రేయ్ కు రామ్ వాయిస్

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు ఎవరో ఒక హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం సర్వసాధారణం అయ్యింది. జల్సా, బాద్ షా, మర్యాద రామన్న.. తాజాగా రేసుగుర్రం చిత్రాలకి హీరోలు వాయిస్ ఓవర్ అందిస్తూ వస్తున్నారు. ఇదే పద్ధతిని దర్శకుడు వైవియస్ చౌదరి కూడా వాడుకున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన "రేయ్" చిత్రానికి నటుడు రామ్ వాయిస్ ఓవర్ ను అందించాడు. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చక్రి అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ లు కథానాయికలు. ఈ చిత్రంపై దర్శకుడు వైవియస్ చాలా నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.