English | Telugu

కృష్ణ ఆవిష్కరించిన ఓరి... దేవుడోయ్ పాటలు

రాజీవ్ సాలూరి, మధురాక్షి, మౌనిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం "ఓరి... దేవుడోయ్". ఈ చిత్ర పాటల సీడీని హైదరాబాదులో ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించి, తొలి సీడీని డి.రామానాయుడుకి అందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ..."సాలూరి రాజేశ్వరరావు, ఆ తర్వాత కోటి, నేను నటించిన ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. అన్నీ సూపర్ హిట్స్. కోటి కొడుకు హీరోగా నటిస్తున్న ఈ సినిమా పెద్ద హిట్టు కావాలి" అని అన్నారు. కోటీ మాట్లాడుతూ..."మా రాజీవ్ సోలో హీరోగా నటించిన ఈ సినిమాకు సంగీతం అందించినందుకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. చేజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రవిశంకర్ వేగరాజు, మాధురి వేగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేగరాజు దర్శకత్వం వహించారు. ఓ యువకుడు బాగా డబ్బు సంపాదించి తన సమస్యలతో పాటు తన చుట్టూ ఉన్నవారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాడనే కథాంశాన్ని వినోదాత్మకంగా చూపించనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.