English | Telugu

హైకోర్టు ముందు హర్ష..అందరిలో టెన్షన్  

యూ ట్యూబర్ హర్ష(harsha sai)తనని లైంగికంగా వేధించడంతో పాటు, భారీ ఎత్తున డబ్బు కూడా కాజేసాడని మాజీ నటి మరియు బిగ్‌బాస్‌ ఫేమ్‌ మిత్రాశర్మ(mitraww sharma) పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.దీంతో హర్షసాయిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు మోదు చేసారు.అప్పట్నుంచి హర్ష పరారీలో ఉన్నాడు.

అజ్ణాతంలో ఉన్న హర్ష ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ని ఆశ్రయించాడు.తనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన దృష్ట్యా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసాడు.నేడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది. దీంతో కోర్టు తీర్పుపై అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది. మిత్ర శర్మ కొన్ని రోజుల క్రితం ఆర్ జె శేఖర్ బాషా పై కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో కొన్ని రోజుల క్రితం ఆర్‌.జె. శేఖర్‌బాషా కూడా అరెస్ట్ అయ్యాడు.తనపై కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మిత్రశర్మ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు మూడు గంటపైగా విచారించారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.