English | Telugu
దిమ్మతిరిగేలా 'పుష్ప-2' ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇది సార్ బ్రాండ్ అంటే...
Updated : Oct 21, 2024
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప-1' మూవీ, 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రూపొందుతోన్న 'పుష్ప-2' ఈ డిసెంబర్ లో థియేటర్లలో అడుగుపెట్టనుంది. (Pushpa 2 The Rule)
'పుష్ప-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా.. 'పుష్ప-2' సరికొత్త రికార్డు సృష్టించింది. (Pushpa 2 Pre Release business)
తెలుగు రాష్ట్రాల్లో రూ.220 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన పుష్ప-2.. తమిళనాడులో రూ.50 కోట్లు, కర్ణాటకలో రూ.30 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.200 కోట్లు, ఓవర్సీస్ లో రూ.120 కోట్ల బిజినెస్ చేసింది. అంటే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.640 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే రూ.640 కోట్లకు పైగా షేర్ (దాదాపు రూ.1300 కోట్ల గ్రాస్) రాబట్టాల్సి ఉంటుంది.
ఇక 'పుష్ప-2' నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ రూ.275 కోట్లకు సొంతం చేసుకోగా.. మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లకు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లకు అమ్ముడయ్యాయి. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి ఈ సినిమా టోటల్ గా రూ.1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే అత్యధిక బిజినెస్. 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' సైతం ఈ రేంజ్ బిజినెస్ చేయకపోవడం విశేషం.