English | Telugu

హారీస్‌ జయరాజ్‌ కిడ్నాప్..?

ప్రముఖ సంగీత దర్శకుడు హారీస్‌ జయరాజ్‌ని కిడ్నాప్ చేసేందుకు జరిగిన ప్రయత్నం విఫలమయ్యింది. ఈ వార్తా ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ వార్త వెలుగులోకి రావడంతో జయరాజ్ అభిమానులు కంగారుపడ్డారు. అయితే కిడ్నాప్ కు ప్రయత్నించిన వారి అరెస్టుతో అంతా సర్దుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు హారీస్‌ జయరాజ్‌ చెన్నైలోని వలసరవాక్కంలో నివసిస్తున్నారు. శనివారం రాత్రి ఆయన ఇంటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి, వెంటనే రూ.20 లక్షల మొత్తాన్ని అందజేయాలని హెచ్చరించారట. డిమాండ్‌ను అంగీకరించకపోతే హారీస్‌ జయరాజ్‌ను అపహరిస్తామని ఆ ఆగంతకులు బెదిరించారట. ఈ విషయమై హారీస్‌ జయరాజ్‌ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిని తిరునెల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన అరుణాచల పాండ్యన్‌ ముత్తుకృష్ణన్‌ తిరుమలై గా గుర్తించారు అని తెలుస్తోంది. తిరుమలై హరీష్ జయరాజ్ తండ్రి వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసి ఉండటం ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.