English | Telugu

లిప్ లాక్ కి ఓకే చెప్పిన యామి..!

అందం ఉండగానే కెరీర్ చక్క పెట్టుకోవాలి అనే విషయం ఇప్పటి హీరోయిన్లకు బాగా తెలుసు అనిపిస్తోంది. అందానికి లౌక్యం జోడించి చక్కగా కెరీర్ ని మూడు సినిమాలు ఆరు అడ్వటైజ్ మెంట్లు చేసుకుంటున్నారు. ఇదంతా మెగా హీరో అల్లు శిరీష్ సరసన గౌరవం మూవీలో నటించిన హీరోయిన్ యామిగౌతమ్ కి సరిగ్గా సరిపోతుంది. టాలీవుడ్ లో మెగా హీరోల పక్కన నటించి భామలకు బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సౌత్ నుండి బిటౌన్ కు వస్తున్న హీరోయిన్స్ కి ఫుల్ క్రేజ్ ఉందట. అందుకే యామిగౌతమ్ రావడం బిటౌన్ నుండి వచ్చినా, టాలీవుడ్ లో యాక్ట్ చేసి, మళ్ళీ హిందీ చిత్రాల్లోకి వెళుతుంది కాబట్టి తనకు తెగ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. యామి గౌతమ్ ప్రస్తుతం హిందీలో ఓ మూవీలో నటిస్తోంది. హిందీలో వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ గర్ల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీలో లిప్ లాక్ సీన్ కూడా ఉందట. దానికి యామిగౌతమ్ నో చెప్పలేదట కాని పారితోషకం మాత్రం పెంచాలని కోరిందట. ముద్దు సీన్ లలో నటిస్తే సౌత్ లో తనకు డిమాండ్ తగ్గిపోతుంది అని వారికి చెప్పిందట. అయితే రెమ్యునరేషన్ పెంచితే పర్వాలేదు అని కవర్ చేసిందట. నిర్మాతలు కూడ యామి గౌతమ్ కు రెమ్యునరేషన్ ను పెంచేందకు ఓకే చెప్పి , లిప్ లాక్ సీన్స్ కోసం హీరోయిన్ నుండి గ్రీన్ సిగ్నల్ సంపాదించారట. మొత్తానికి యామిగౌతమ్ ఇటు సౌత్ ని, అటు బాలీవుడ్ ని సరైన సమయంలో సరిగ్గా వాడుకుంటూ బాగానే డిమాండ్ ను క్రియేట్ చేసుకుంటుందని టాలీవుడ్ అంటుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.