English | Telugu

మిర్చీభామ హంసానందినికి తప్పిన ప్రమాదం


ఐటెమ్ సాంగ్స్ ద్వారా దక్షిణాదిలో గుర్తింపు సంపాదించుకున్న హంసానందిని కారు ప్రమాదం నుంచి తప్పించుకొని క్షేమంగా బయటపడింది అని సమాచారం. కడప జిల్లా నుంచి హైదరాబాద్‌ వైపు కారులో ప్రయాణిస్తు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, మహబూబ్‌నగర్ జిల్లా మునిరంగస్వామి ఆలయ సమీపంలోకి రాగానే ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయిందని, దాంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో హంసానందినికి చిన్నగాయాలు అయ్యాయని చెప్తున్నారు. ఆ సమయంలో ఆమెతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని తెలుస్తోంది. డ్రైవర్ సమయస్ఫూర్తి వలన ప్రాణాపాయం తప్పిందని వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆమె క్షేమా సమాచారం తెలుసుకున్నారట. ‘అత్తారింటికి దారేది’,‘మిర్చీ’ సినిమాలలో ఐటమ్ భామగా పేరు తెచ్చుకున్న హంసానందినికి ప్రాణసంకటం తప్పినందుకు ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.