English | Telugu

నవ్వించి చంపేసిన "గ్రాండ్ మస్తీ"

సినిమా అనేది అందరిని నవ్వించే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఆ నవ్వులు ఎక్కువై ప్రాణాలు కోల్పోయే రేంజులో సినిమా ఉందంటే నమ్ముతారా? కానీ నమ్మక తప్పదు. బాలీవుడ్ లో ఇటీవలే విడుదలైన చిత్రం "గ్రాండ్ మస్తీ". ఈ చిత్ర ట్రైలర్ లోనే చాలా బూతు డైలాగ్స్ ఎక్కువగానే వున్నాయి. అయితే ఈ చిత్రంను ముంబైలోని 22 ఏళ్ల మంగేష్ అనేవ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కెటి‌విషన్ అనే మల్టీ‌ప్లెక్స్‌లో సినిమాకు వెళ్ళాడు. ఈ చిత్రంలో వచ్చే కామెడీ సన్నివేశాలు అందరూ నవ్వుతున్నారు. అందరితో పాటు మంగేష్ కూడా ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తుండగా, విపరీతంగా నవ్వడంతో చివరకు అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని హాస్పిటల్ కి తరలించినప్పటికీ, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకయ్యారు. సినిమా చూస్తే హాయిగా నవ్వుకోవాలని ఉంటుంది కానీ... మరీ ఇలా ప్రాణాలు పోయే విధంగా నవ్వుకోవాలని ఎవరు అనుకోరు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.