English | Telugu

12 ఏళ్ళ తర్వాత గోపీచంద్ సాహసం.. హిట్ కొడతాడా?

కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న మాచో స్టార్ గోపీచంద్‌ (Gopichand).. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించాడు. తాజాగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో గోపీచంద్‌ ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ బ్యానర్ లో 'సాహసం'(2013) వంటి విభిన్న చిత్రంతో మెప్పించాడు గోపీచంద్. 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ చిత్రం, గురువారం (ఏప్రిల్ 24) నాడు అధికారికంగా ప్రారంభమైంది.

బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. థ్రిల్లింగ్ కథాంశంతో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం రాబోతోందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మలయాళ నటి మీనాక్షి దినేష్ కథానాయికగా నటించనుంది. సినిమాటోగ్రాఫర్ గా శామ్‌దత్ వర్క్ చేయనున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.