English | Telugu

'గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ అదిరింది

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకటేష్, పవన్ కళ్యాణ్ల మల్టీ స్టారర్ 'గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రం బృందం.ఫస్ట్‌ లుక్‌ వీడియోలో పవన్‌కళ్యాణ్‌, ఉయ్యాలలో సేదతీరుతుండగా, వెంకటేష్‌.. పవన్‌కళ్యాణ్‌ సేదతీరుతున్న విధానాన్ని అనుకరిస్తుంటాడు. అందుకు తగ్గటు అనుప్ రూబెన్స్ సూపర్ స్కోర్ అందించాడు. పవన్‌కళ్యాణ్‌ స్నేహితుడు శరద్‌ మరార్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత, వెంకటేష్‌ సోదరుడు సురేష్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం విదితమే. సంక్రాంతికి విడుదల కానున్న ‘గోపాల గోపాల’ టీజర్‌తోనే ఇటు వెంకీ అభిమానుల్లోనూ, అటు పవన్‌ అభిమానుల్లోనూ అంచనాల్ని అమాంతం పదింతలు చేసేసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.