English | Telugu

కృష్ణాష్టమికి గోపాల గోపాల మొదటి దర్శనం


టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ "గోపాల గోపాల" చిత్రం గురించి పరిశ్రమల్లో, అభిమానుల్లో నెలకొన్న ఆసక్తి గురించి విడిగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ మోడరన్ కృష్ణుడిగా ఎలా వుంటాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులు ఆగస్టు 17 న ముగియనున్నాయి. గోపాల గోపాల టైటిల్‌కి అనుగుణంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ను కృష్ణాష్టమి రోజున విడుదల చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.


అలాగే అక్టోబర్ 23న దీపావళి పండుగ రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దపడుతున్నట్లు తెలిస్తోంది. బాలీవుట్ చిత్రం ఓ మై గాడ్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, పవన్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన శ్రీయా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, పోసాని, ప్రియమణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.