English | Telugu

కొత్త 'అల్లుడు శీను' బాగా మాస్ - సినిమా రివ్యూ


కథ
అల్లుడు శీను(బెల్లంకొండ శ్రీనివాస్) అతని మామ నరసింహ(ప్రకాష్ రాజ్) ఉన్న ఊర్లో అప్పులు చేసి తప్పించుకోవడానికి చెన్నైకి వెళ్లాలనుకొని హైదరాబాద్ చేరుకుంటారు. అనుకోకుండా వారు హైదరాబాద్ కి వస్తారు. అల్లుడు శీను కి తన మామలా వుండే భాయ్(ప్రకాష్ రాజ్) కనిపిస్తాడు. ఈ విషయాన్ని క్యాష్ చేసకుంటాడు శీను. ఈ గ్యాప్ లో భాయ్ కూతురు అంజలి(సమంత) తో శీను ప్రేమలో పడతాడు. అంజలి కూడా కొంత టైం తర్వాత శీను ని ప్రేమిస్తుంది. మరోవైపు భాయ్ తన కూతురుని భాను(ప్రదీప్ రావత్) కొడుకు కి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటాడు. ఆ తర్వాత జరిగేది మిగతా కథ. భాయ్, నరసింహ ఒకేలా వుండటానికి వారి మధ్య ఉన్న సంభంధం ఏమిటి, అల్లుడు శీను, అంజలి పెళ్లి జరుగుతుందా, లేదా? అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్‌లు మైనస్‌లు


కొత్త హీరోని లాంచ్ చెయ్యడానికి ఏయే హంగులు వుంటే మేలు అనుకున్న ఆలోచన ఈ సినిమా రూపకల్పనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆయా హంగులు సమకూర్చడంలో నిర్మాత బెల్లంకొండ ఏ లోటు చెయ్యలేదు. పేరున్న దర్శకుడు, టాప్ హీరోయిన్, టాప్ రచయిత, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అంతా టాప్ వరుసలో వున్న వారిని ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. కావలిసినంత హైప్ క్రియేట్ చేశారు. సినిమాకు ఇవన్నీ హెల్ప్ చేశాయనే చెప్పవచ్చు.
సినిమాకు సమంత చాలా పెద్ద ప్లస్. అయితే ఈ కొత్త హీరోని లాంచ్ చేయడానికి మాస్ ఎలిమెంట్స్ వున్న కథాంశం ఎంచుకోవడం మైనస్ అనిపిస్తుంది. సమంత ముందుకన్నా గ్లామరస్ గా ఈ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమాలో ఆమె నటనకు అవకాశం తక్కువే అనిచెప్పాలి. తెలుగు సినిమా మూస తరహాలో పాటలకు, కొన్ని సీన్లకు పరిమితం చేశారు. ఇక స్పెషల్ సాంగ్‌లో కనిపించిన తమన్నా మరికొందరు ప్రేక్షకులను థియేటర్ వరకూ వచ్చేలా చేస్తుందని చెప్పవచ్చు. డింపుల్ బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కూడా పర్వాలేదనిపించింది. ప్రకాశ్ రాజ్ రెండు పాత్రలలో వేరియేషన్ బాగా చూపించగలిగారు.
యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇష్టపడే వారిని ఈ సినిమాలో ఫైట్స్ బాగా ఆకట్టుకుంటాయి. సన్నివేశాలు రూపొందించడంలో రిచ్‌నెస్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అలాగే పాటల కోసం వేసిన సెట్లు కూడా బాగున్నాయి.
కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో డాన్సులు, డైలాగులు, ఫైట్ల విషయంలో ప్రతిభ కనిపించాడు. మాస్ కథాంశంతో దర్శకుడు వినాయక్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కోన వెంకట్ డైలాగులు కొన్ని గుర్తుండిపోయేలా వున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఈ మాస్ ఎంటర్‌టేనర్ కు తగ్గట్టుగా వున్నాయి. ఈ చిత్రం కలెక్షన్లు ఎలా వుంటాయో వేచి చూడాల్సిందే.

తారాగణం - బెల్లం కొండ శ్రీనివాస్, సమంత, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్ మొదలగు వారు..
నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, సమర్పణ:బెల్లకొండ సురేష్,
దర్శకత్వం:వి.వి.వినాయక్
రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, మాటలు - కోనా వెంకట్
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్,
కెమెరా:ఛోటా కె.నాయుడు,
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్,

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.