English | Telugu
మహేష్ బర్త్ డే ట్రీట్
Updated : Aug 5, 2023
సూపర్‌స్టార్ మహేష్ తాజా చిత్రం ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న మూవీని రిలీజ్ చేయాలనేది నిర్మాతల ప్లాన్. దాని మేరకు ఇప్పటికే వారు అధికారిక ప్రకటనను కూడా ఇచ్చేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై నెట్టింట మాత్రం చాలా వార్తలే వినిపిస్తోన్న వాటిని మేకర్స్ లైట్ తీసుకున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. మహేష్ తండ్రి కృష్ణ బర్త్ డే సందర్బంగా గ్లింప్స్ విడుదల చేయగా.. అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ మరో అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు. ఆ డేట్‌కు ముందు రోజో లేక అదే రోజో ఏదైనా అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
లేటెస్ట్‌గా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు మహేష్ పుట్టినరోజు (ఆగస్ట్ 9) సందర్భంగా ‘గుంటూరు కారం’ నుంచి పాటను విడుదల చేస్తారు. తమన్ ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన వర్క్ పూర్తి చేశారు. మహేష్‌కి వినిపించి ఆయన దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహేష్ ఓకే అంటే ఇక ప్రకటన వచ్చేస్తుంది. అది ఫ్యాన్స్‌కి కచ్చితంగా ట్రీట్ అవుతుందనటంలో సందేహం లేదు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు.
మహేష్ ఓ వైపు మాస్‌గా.. మరో వైపు క్లాస్‌గా కనిపించబోతున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, తివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘గుంటూరు కారం’. దీని కోసం మహేష్ సిక్స్ ప్యాక్ లుక్ కూడా చేశారని, అదందరికీ ఓ సర్‌ప్రైజ్‌లా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.