English | Telugu

కుక్కల చావు 50 రూపాయలు ఒకటేనా..అనాగరిక మనుషులు 

ఇలియానా అనే పేరు దశాబ్డం పాటు తెలుగు కుర్రకారుని ఒక ఊపు ఊపింది. దాదాపుగా టాప్ స్టార్స్ అందరితోను జోడి కట్టింది. బాలీవుడ్ లోను తన సత్తా చాటింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఇలియానా లేటెస్ట్ గా చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.

ఒక కుక్కని రాడ్ తో కొట్టి చంపిన సంఘటన ఇప్పుడు అందర్నీ కలిచివేస్తుంది. ఈ విషయం పైనే ఇలియానా ఫైర్ అవుతుంది. మరీ ఇంత దారుణమా! కుక్కని చంపడం చాలా నీచమైన పని. అలాంటి అనాగరిక మనుషుల్ని మార్చడానికి చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. జంతువులపై జరిగే క్రూరత్వాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.ఇక కుక్కని చంపిన వ్యక్తి అయితే యాభై రూపాయల పూచీకత్తు బెయిల్ మీద బయటకు వచ్చాడు.ఈ విషయం గురించి కూడా ఆమె మాట్లాడింది.

అతన్ని బయటకి పంపించారు. మరీ చనిపోయిన పెట్‌తో ఆడుకునే మరో పెట్ మాత్రం రోజంతా ఫుడ్ తీసుకోలేదు. ప్రతీ రోజూ ఆడుకునే పెట్ కనిపించడం లేదంటూ దిగాలుగా కూర్చుంది.దానికి ఎవరు న్యాయం చేస్తారంటూ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఇలియానా అడుగుతున్న ఈ ప్రశ్నలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇలియానా ఎప్పటినుంచో పెట్ లవర్. వాటిని తన సొంత మనుషులుగా చూసుకుంటుంది. ప్రస్తుతం తన భర్త కొడుకుతో కలిసి అమెరికాలో ఉంటుంది. ప్రస్తుతానికి అయితే తన చేతిలో కొత్త సినిమాలు ఏమి లేవు. ఫ్యూచర్ లో చేస్తుందేమో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.